ETV Bharat / state

"ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో" - చిరుతపులి కలకలం - CHEETAH MOVEMENT IN ANNAMAYYA DIST

అన్నమయ్య జిల్లాలో చిరుత సంచారంతో వణుకుతున్న ప్రజలు

cheetah_movement_in_annamayya_dist
cheetah_movement_in_annamayya_dist (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 1:04 PM IST

Cheetah Movement in Annamayya District People Panic : అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో చిరుత పులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. మూడుచోట్ల పశువులు, మేకలపై దాడి చేయడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. మేతకు తీసుకెళ్లాలన్నా, ఇంటి బయట వాటిని కట్టేయాలన్నా భయాందోళన చెందుతున్నారు. ఏ వైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందోనని గజగజ వణుకుతున్నారు.

నేలమళ్లేశ్వరస్వామి అటవీ ప్రాంతం, చల్లావారిపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రాంతంలోని చలిమామిడి కొండ, నిమ్మనపల్లె, వాల్మీకిపురం సరిహద్దు ప్రాంతంలో ఉన్న నూరుకుప్పల కొండలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఉదంతాలివి: ఆగస్టు 1న మర్రిబండవద్ద శ్రీరాములుకు చెందిన దూడను, మేకను గాయపరచగా రైతు అప్రమత్తంగా వ్యవహరించడంతో కుక్కను లాక్కెళ్లి చంపేసింది. అప్పట్లో అటవీ శాఖాధికారులు గ్రామాన్ని సందర్శించి గాయపడిన దూడ, మేకల గాయాలను పరిశీలించి చిరుత పులి ఆనవాళ్లు లేవని తేల్చారు.

  • గత నెల 31న చల్లావారిపల్లెకు చెందిన ఆదెన్న సమీపంలోని బోడికొండ వద్ద తనకున్న పొలంలో షెడ్డు వేసుకుని ఆవులను పోషిస్తున్నారు. ఆవులను షెడ్డులోనే ఉంచి చల్లావారిపల్లెలో కాపురం ఉంటున్నారు. షెడ్డు వద్ద ఆవు పాలు పిండడానికి రాగా షెడ్డు వద్ద కట్టేసిన ఏడాదిన్నర దూడ కన్పించలేదు. సమీపంలో దూడ కళేబరం కన్పించడంతో చిరుత లాక్కెళ్లి చంపేసినట్లు గుర్తించారు. దీపావళి పండుగ రోజు కావడంతో టపాకాయల శబ్దాలకు చిరుత పారిపోయింది.
  • ఈ నెల 1న గౌనిగారిపల్లెకు చెందిన శంకర తన గొర్రెలను బోడికొండ సమీపంలో మేపుతుండగా చిరుతపులి రెండు గొర్రెలపై దాడి చేస్తుండగా గొర్రెల కాపరి అరుపులకు పరుగులు తీసింది.
  • ఈ నెల 8న చిరుతలగుట్ట వద్ద పారేశువారిపల్లెకు చెందిన రామయ్య మేకను తినేసింది. దీంతో చిరుత సంచారం వాస్తవమేనని అటవీ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేయడం ప్రారంభించారు.
  • నిమ్మనపల్లె మండలంలోని తవళం శ్రీనేలమళ్లేశ్వరస్వామి అటవీ ప్రాంతంలో అయిదేళ్ల కిందట చౌకిళ్లవారిపల్లెకు చెందిన గంగులప్ప గోసంరక్షణశాల నిర్వహిస్తుండగా ఓ ఆవుపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లింది.

ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry

పశువులు, మేకల మృతితో చిరుత పులి ఆనవాళ్లను గుర్తించామని అటవీశాఖ బీట్‌ అధికారి దీప తెలిపారు. చిరుత సంచారంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిరుతకు ఎవరూ హాని కలిగించవద్దని గ్రామస్థులకు వివరిస్తున్నాం. చిరుత దాడిలో ఏమైనా నష్టాలు జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని అన్నారు. చిరుతకు హాని కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఒంటరిగా పశువులు మేపడం, పొలాల వద్దకు వెళ్ల వద్దని హెచ్చరించారు.

"పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.