Rakta Pinjara Snake In Konaseema District: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని కందికుప్పలో ప్రమాదకరమైన రక్తపింజర పాము హల్చల్ చేసింది. స్థానికంగా నివసించే వాసు అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని బడ్డీలో రక్త పింజర పాము ప్రవేశించడంతో ఇంట్లోని వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పుడు స్థానికుల సహాయంతో వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ కేచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వర్మ ఆ పామును చాకచక్యంగా ఒక డబ్బాలో బంధించటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రక్తపింజర పాము చాలా ప్రమాదకరమైనదని కొండల ప్రాంతాల్లోనే ఉంటుందని అయితే ఇది గ్రావెల్ లోడుతో పాటు ఈ ప్రాంతంలోకి వచ్చి ఉంటుందని వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వామ్మో! 18.5 అడుగుల కొండచిలువను చూశారా?
తిరుమలలో భారీ నాగుపాము హల్ చల్
ప్రపంచంలో విషం లేని పాములే ఎక్కువ - ప్రజల్లో అవగాహన పెంచుతున్న EGWS - Eastern Ghats Wildlife Society