Rare Kachidi Fish Caught Fisherman Net in Kakinada Coast: అరుదైన చేపగా పేరొందిన కచిడి చేప మత్స్యకారులకు కాసులు కురిపించింది. కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు ఆదివారం 25 కిలోల కచిడి చేప చిక్కింది. దీనిని కుంభాభిషేకం రేవులో విక్రయించగా రూ.3.95 లక్షలు పలికింది. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని, అందుకే దీనికి ఇంత డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు వెల్లడించారు.
విశేషాలు: ఈ కచిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని స్థానిక గంగపుత్రులు అంటున్నారు. మందుల తయారీలోనూ దీని భాగాలను వినియోగించడం వల్ల ఈ చేపకు మార్కెట్‌లో భారీ ధర పలుకుతుంది. ఈ కచిడి ఓ చోట స్థిరంగా ఉండదు. ఎప్పుడూ ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ ప్రయోజనాల వల్ల ఈ కచిడి చేప మత్స్యకారులకు ఎప్పుడు లభ్యమైనా మార్కెట్‌లో భారీ ధర పలుకుతుంది.
ఈ చేప ఒక్కటి చిక్కినా లైఫ్ సెటిల్! 27కిలోల చేప ఎంత ధర పలికిందో తెలుసా?
Kachidi Fish: వలకు చిక్కిన కచిడి చేప...ధరెంతో, ఎందుకు వాడతారో తెలుసా..?