Uppa Trees In Alluri District: ప్రకృతి ఒడిలో రంగుల ప్రపంచం చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. కనుచూపు మేర పచ్చదనం మధ్యలో హరివిల్లును తలపించే ఉప్పచెట్ల సొగబులు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉప్పచెట్లను మీరు ఎప్పుడైనా చూశారా? అబ్బురపరిచే రమణీయ దృశ్యాలు అక్కడి విశేషాలు మనమూ తెలుసుకుందాం.
15 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పచెట్లు: గిరిజనులు తమ ఆధ్యాత్మిక సంపదగా భావించే ఉప్పచెట్ల మనోహర దృశ్యాలు మనసుకు వింతైన అనుభూతినిస్తాయి. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఉప్పబంగారంగరువు మధ్యలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ వృక్ష సంపద ఉంది. ఈ చెట్ల ఆకులు శీతాకాలంలో బంగారు వర్ణంలో మెరుస్తాయి. వేసవి నాటికి వీటి రంగు తెల్లగా మారుతుంది. అనంతరం వచ్చే ఉప్పపూల సుగంధం కిలోమీటర్ వరకు వ్యాప్తి చెందుతుంది.
భారీ వృక్షాలతో కనిపిస్తున్న ఈ ప్రాంతంలో నంది గౌరమ్మ దేవతకు చిన్న గడ్డి కుటీరం ఉంది. వర్షం కురిసి తమ పంటలు బాగా పండాలని మూడేళ్లకి ఒకసారి పూజలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. చెట్ల నుంచి వచ్చే గింజల్లో అనేక ఔషధ గుణాలున్నాయని దేశంలో ఇలాంటి వృక్షజాతి ఎక్కడా లేదని స్థానికులు చెబుతున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం, మధ్యలో పాండవుల రాతి బొమ్మలు, భారీ మోడు కలిగిన సంపంగి చెట్లు ఇవన్నీ ఉప్ప చెట్ల పరిసరాల్లో మనం చూడవచ్చు. అరుదైన వృక్షజాతి సంపద కాపాడుకునేలా గతంలో స్థానిక యువకులకు అటవీ అధికారులు శిక్షణ ఇచ్చారు. పురాతన చరిత్ర కలిగిన ఉప్పచెట్ల ప్రాంతానికి పర్యాటకులు పెరుగుతున్నారు. దైవత్వంతో నిండిన ప్రాంతంలో ప్రశాంతత లభిస్తుందని టూరిస్టులు చెబుతున్నారు. ఉప్పచెట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
''పురాతన చరిత్ర కలిగిన ఉప్పచెట్ల ప్రాంతానికి పర్యాటకులు పెరుగుతున్నారు. దైవత్వంతో నిండిన ప్రాంతంలో ప్రశాంతత లభిస్తుంది. ఉప్పచెట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నాం''-పతంజలి శ్రీనివాస్, యోగా గురువు
''వేసవి నాటికి వీటి రంగు తెల్లగా మారుతుంది. అనంతరం వచ్చే ఉప్పపూల సుగంధం కిలోమీటర్‌వరకు వ్యాప్తి చెందుతుంది. భారీ వృక్షాలతో కనిపిస్తున్న ఈ ప్రాంతంలో నంది గౌరమ్మ దేవతకు చిన్న గడ్డి కుటీరం ఉంది. వర్షం కురిసి మా పంటలు బాగా పండాలని మూడేళ్లకి ఒకసారి ఇక్కడ పూజలు చేస్తాం''-ఆసన్న, బంగారం గరువు గ్రామం
అరకులో చలి పండుగ - రూ.కోటి మంజూరు చేసిన పర్యాటక శాఖ
ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
పర్యాటకరంగంలో 25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్