Rushikonda Palace : ఆ భవనాల ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు (గ్రిల్‌తో సహా) ఎంతో తెలుసా రూ. 31,84,247. బాత్‌రూమ్‌లో అమర్చిన వాల్‌మౌంటెడ్ కమోడ్ ధర అక్షరాలా రూ. 11,46,840. బాత్‌రూమ్‌లో ఒక్కో షవర్‌కి పెట్టిన ఖర్చు రూ.44,640 పైమాటే. ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన బ్రునై సుల్తాన్ ఇంటికి పెట్టిన ఖర్చు కానే కాదు.
వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ నివాసం కోసం విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్‌లో పెట్టిన ఖర్చు. రూ.409.39 కోట్లు. ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నిర్మించిన ఆ భవనాల్లో బాత్‌టబ్‌లు, షవర్లు, కమోడ్‌లు, తలుపులు తదితరాలకు పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యుల కళ్లు తిరిగిపోతాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ కొనొచ్చు : రుషికొండ ప్యాలెస్‌లో వాడిన ఒక బాత్ టబ్, కమోడ్, ప్రధాన తలుపు ఖరీదుతో విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో కుటుంబానికి అవసరమైన డబుల్ బెడ్ రూం ఫ్లాట్ వచ్చేస్తుంది. ప్రధాన డోర్‌లకు రూ.31.84 లక్షలు చొప్పున ఖర్చు చేశారు. ఇతర తలుపులు ఒక్కోదానికి రూ.17,93,658 చొప్పున వెచ్చించారు. బాత్‌రూమ్‌లలోని ఒక్కో బాత్‌టబ్‌కి పెట్టిన ఖర్చు రూ.12,38,771. ఒక్కో వాష్‌బేసిన్‌కి పెట్టిన ఖర్చు రూ.2,61,500.
ప్రధాన ప్రవేశ ద్వారం ముందు అలంకరణ కోసం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఆర్‌సీసీ సర్క్యులర్ కాలమ్స్‌కి ఒక్కోదానికి రూ. 9,11,719 చొప్పున మొత్తం ఎనిమిది కాలమ్స్‌కి రూ. 72,93,752 వెచ్చించారు. కాన్ఫరెన్స్ టేబుల్ (12.92 మీటర్ల పొడవు) ఖరీదు 24.37 లక్షలు. 15 మీటర్ల పొడవు ఉన్న ఆంగ్ల అక్షరం యు ఆకారపు టేబుల్ ఖరీదు రూ. 53,73,700.
ఎక్కడా చూడలేదు : పెద్దపెద్ద భవనాలు, స్టేడియాలు, మాల్స్ నిర్మించే కాంట్రాక్టు ఫీల్డ్‌లో 1983 నుంచి ఉన్నానని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు తెలిపారు. తన నాలభై ఐదేళ్ల అనుభవంలో రుషికొండ ప్యాలెస్‌లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్‌లు చూడలేదని చెప్పారు. సివిల్, ఇంటీరియర్, ఫర్నిచర్ కలిపి చదరపు అడుగుకి రూ. 14,023 ఖర్చయిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఎక్స్‌కవేషన్, హిల్ కటింగ్ వంటి ఖర్చులు కలిపితే చదరపు అడుగుకి ఇంకా ఎక్కువ ఖర్చవుతుందని విష్ణుకుమార్‌రాజు వివరించారు.
ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు - ఈ దుర్మార్గం అందరూ చూడాలి: సీఎం చంద్రబాబు
'21వ శతాబ్దపు నయా చక్రవర్తి'- రుషికొండ రాజమహల్లో కళ్లుచెదిరే నిర్మాణాలు - jagan bathroom