ETV Bharat / city

రూ.200లు ఎగ్గొట్టాడని కుల బహిష్కరణ!

కుల, గ్రామ బహిష్కరణలు ఉండేవని ఎవరైనా చెప్తే వినేవాళ్లం. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే... తెలంగాణ మెదక్​ జిల్లా శివ్వంపేట పిల్లుట్లలో చోటు చేసుకుంది. అది కూడా ఏదో చేయరాని నేరం చేసినందుకు కాదు. రూ.200లు ఇవ్వనందుకు... కుల పెద్దలు ఇచ్చిన తీర్పు.

one family social expelled in pillutla village medak district
రూ.200లు ఎగ్గొట్టాడని కుల బహిష్కరణ!
author img

By

Published : Sep 22, 2020, 6:15 PM IST

రూ.200లు ఎగ్గొట్టాడని కుల బహిష్కరణ!

తెలంగాణ మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్లలో దాసరి నర్సింలు అనే వ్యక్తిని... కుల పెద్దలు బహిష్కరించారు. అతని కుటుంబంతో ఎవరు మాట్లాడినా... రూ.5 వేల జరిమానా, 5 చెప్పు దెబ్బల శిక్ష ఖరారు చేశారు. ఇంత పెద్ద శిక్ష వేసింది... ఎంతో పెద్ద నేరం చేసినందుకు కాదు. కేవలం రూ.200లు ఎగ్గొట్టినందుకు. నిత్యం గొడవలకు దిగుతున్నాడని, ఎవరు చెప్పినా వినడం లేదని, విసిగిపోయి... ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుల పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా... పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

one family social expelled in pillutla village medak district
రూ.200లు ఎగ్గొట్టాడని కుల బహిష్కరణ!

నర్సింలు పంటపొలంలో బోరు మరమ్మతులో భాగంగా... పైపులు దించడానికి మల్లయ్యను తీసుకెళ్లాడు. దీనికోసం రూ.700 ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. పని పూర్తయ్యాక రూ.500 ఇచ్చాడు. మిగతా డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పోలీసు స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ విషయమై కులపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. విచారించిన పెద్దలు నర్సింలు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయాలని తీర్మానించారు.

ఇదీ చూడండి:

రఘురామకృష్ణరాజుపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.