పాత వాహనాలను తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్ర రహదారుల, రవాణాశాఖ దశల వారీగా అమలు చేయనుంది. ఇందులో 20 ఏళ్లు దాటిన సొంత వాహనాలు, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు సామర్థ్య పరీక్షలో విఫలమైతే వాటి రిజిస్ట్రేషన్‌ను ఆపేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం 20 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనాలు 11.83 లక్షలున్నట్లు గుర్తించారు. 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న కార్లు 74,528 ఉన్నాయి. రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. సొంత వాహనాలను కొనుగోలు చేసినప్పుడు వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 15 ఏళ్లకు ఇస్తారు. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్రం తీసుకొస్తున్న వాహన తుక్కు విధానంలో భాగంగా సొంత వాహనాలు 20 ఏళ్లు దాటితే, వాటికి ఆటోమేటెడ్ సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో విఫలమైతే రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించరు. వీటిని తప్పకుండా తుక్కుగా ఇవ్వాల్సి ఉంటుంది.
15 ఏళ్లు దాటిన లారీలు 54,767
వాణిజ్య వాహనాలకు 15 ఏళ్లు దాటితే సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వాణిజ్య వాహనాలు 2.64 లక్షలున్నాయి. ఇందులో సరకు రవాణా చేసే వాహనాలు 54,767 ఉన్నాయి.
ఇదీ చదవండి: