ఏవోబీ(ఆంధ్రా-ఒడిశా సరిహద్దు)లో ఒడిశా డీజీపీ అభయ్ విస్తృతంగా పర్యటించారు. సోమవారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆ రాష్ట్ర నిఘా విభాగం డీజీపీ ఆర్.కె.శర్మ, ఐజీ అమిత్ ఠాకూర్, డీఐజీ(ఎస్‌వోజీ) అనిరుద్ సింగ్, మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారితో కలిసి నేరుగా కటాఫ్ ఏరియాలోని బీఎస్ఎప్ క్యాంపునకు చేరుకున్నారు. అక్కడ బీఎస్ఎఫ్, ఎస్‌వోజీ, డీవీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏవోబీలో మావోయిస్టుల కదలికలు గురించి ఆరా తీశారు.
మావోయిస్టుల కదలికలపై సమాచారం వచ్చిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టే విధంగా ఆర్మ్డ్ అవుట్ పోస్టుల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఏవోబీలో శాంతి భద్రతలు పరిరక్షణే ద్యేయంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సింగారం అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్న గాలింపు బృందాలతో ఆయన ముచ్చటించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
'కటాఫ్ ఏరియాలో ప్రతి ఒక్కరూ శాంతియుత వాతవరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. అడవిలో ఆయుధాలతో పోరాటం చేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం'- అభయ్, డీజీపీ, ఒడిశా
ఇదీ చదవండి