ఉగాది పండగ సందర్భంగా కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని ముస్లిం భక్తులు దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. వెంకటేశ్వరస్వామి సతీమణి గోదాదేవిని ముస్లింలు బీబీనాంచారిగా పిలుచుకుంటారు. అందులో భాగంగానే ఉగాది రోజున.. అల్లుడైన వెంకన్నను దర్శించుకోవాలనే పూర్వకాలపు ఆచారంతో పెద్ద సంఖ్యలో దేవుని కడప ఆలయానికి వచ్చారు.
స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆడపడచు లాంఛనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామివారికి టెంకాయలు కొట్టి, దర్శనం చేసుకున్నారు. కేవలం ఉగాది పండగ రోజున మాత్రమే ముస్లిం భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ పూజారి తెలిపారు.
ఇదీ చదవండి:
ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్