ETV Bharat / city

ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధిస్తూ నోటిఫికేషన్.. నవంబర్​ 1 నుంచి అమలు - ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి

PLASTIC FLEXI BAN IN AP
PLASTIC FLEXI BAN IN AP
author img

By

Published : Sep 22, 2022, 6:14 PM IST

Updated : Sep 22, 2022, 6:59 PM IST

18:11 September 22

నవంబరు 1 నుంచి నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వులు

PLASTIC FLEXIS BAN IN AP : రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనపైనా నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో నగరాలు, పట్టణాల్లో అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది.

గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది. నిషేధం అమలును పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.