జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు.
సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో గ్యాలరీ కూలిపోయింది. సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
ఇవీ చూడండి: