రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది... అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన...విశాఖలో జరిగిన పత్రికా సమావేశంలో తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారన్నారు. తాను కేవలం శివరామకృష్ణ కమిటీపైనే వ్యాఖ్యానించానన్నారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ ఉన్న ప్రాంతాన్నే రాజధాని అంటారన్నారు. రాజధాని విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి అన్నారు. 13 జిల్లాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి