ETV Bharat / city

ప్రస్తుతానికి పాత పన్నులే!

పట్టణ స్థానిక సంస్థల్లో వార్షిక అద్దె విలువ (ఏఆర్వీ) ప్రాతిపదికగా అమలు చేస్తున్న ఆస్తి పన్ను విధానాన్ని కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా విధించే పన్ను విధానం అమలులోకి వచ్చే వరకు పాత పద్ధతే తాత్కాలికంగా అమలులో ఉంటుంది. ఈ మేరకు పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది.

tax
tax
author img

By

Published : Apr 10, 2021, 9:58 AM IST

ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ సంత్సరానికి పాత విధానం ప్రకారమే పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా వార్షిక పన్ను మొత్తం చెల్లిస్తే 5% రాయితీ కూడా ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా ఏప్రిల్‌ నుంచి పన్నులు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పుర ఎన్నికలకు ముందే ప్రత్యేక అధికారులు ఆమోదించి తీర్మానాలు చేశారు. పాలకవర్గాలు కొలువుదీరిన వేళ కొత్త పన్ను విధానాన్ని పురపాలకశాఖ తాత్కాలికంగా పక్కన పెట్టింది.

పలు కారణాలతో గత నెలలో ఎన్నికలు నిర్వహించని మూడు నగరపాలక సంస్థలు, 32 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన మేయర్లు, పుర ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సులో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత విధానంలోనే పన్నులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రత్యేక తాఖీదుల జారీయే ఆలస్యం

రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా కొత్త పన్నుల వసూళ్లకు పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రత్యేక తాఖీదులు (స్పెషల్‌ నోటీసులు) ఇవ్వడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. తాఖీదులిచ్చాక కొత్తగా విధించే పన్నుపై అభ్యంతరం ఉంటే ప్రజలు రివిజన్‌ పిటిషన్లు (ఆర్పీ) వేసుకుంటే కమిషనర్లు మరోసారి పరిశీలనకు ఆదేశిస్తారు. కొత్త పన్నుల విధానం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ద్రవిడ్​కు కోపం.. రోడ్డుపై అరుస్తూ హల్​చల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.