సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ పనితీరుపై సచివాలయంలో రెండో రోజు నీతి ఆయోగ్ సమీక్ష నిర్వహించింది. నీతి ఆయోగ్ సలహాదారు, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్ సంస్కరణల ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సంస్కరణలు చాలా కీలకమని వ్యాఖ్యనించింది. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్ 62వ స్థానంలో ఉందని వెల్లడించింది.
మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఏపీప్రభుత్వం నీతి ఆయోగ్‌కు వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని తెలిపింది. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని స్పష్టం ఏపీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
సీఎంను కలిసిన నీతి ఆయోగ్ బృందం
సమీక్ష అనంతరం నీతి ఆయోగ్ బృంద సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్ 2020–21 రిపోర్టును సీఎంకు అందజేశారు.
ఇదీ చదవండి:
FAKE CHALLANS: నకిలీ చలానాల కుంభకోణం..ప్రభుత్వం అంతర్గత విచారణ