కరోనా కారణంగా రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదీ చదవండి: