Mortgage Assets Registration: ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలను పొందేందుకు జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు బ్యాంకుల నుంచి ఎన్వోసీ తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ఉత్తర్వులను జిల్లాలకు పంపింది. మార్ట్‌గేజ్ రుణాలకు సంబంధిత వ్యక్తులు సమర్పించిన ఆస్తుల దస్తావేజులను బ్యాంకు అధికారులు పరిశీలించి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనఖా పెట్టినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని రావాలని సూచిస్తుంటారు.
బ్యాంకు, రుణం పొందిన వ్యక్తి మధ్య జరిగిన ఒప్పందానికి ఇది గుర్తుగా ఉంటుంది. ఒక బ్యాంకు నుంచి రుణం పొందిన ఆస్తినే.. మరో బ్యాంకులో తాకట్టు పెట్టడం, ఇతరులకు విక్రయించడం, గిఫ్ట్ రూపంలో కుటుంబ సభ్యులకు ఇవ్వడం చేస్తున్నారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: