గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,743 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,049 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
అనంతపురంలో 9, చిత్తూరులో 19, తూర్పుగోదావరిలో 22, గుంటూరులో 17, కడపలో 3, కృష్ణాలో 15, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 30 కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి.