భారత అంతర్జాతీయ షూటర్ నమన్వీర్ బ్రార్(28) పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నమన్వీర్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నమన్వీర్ బ్రార్ తన కుటుంబంతో కలిసి ఇంటి నంబరు 1097, సెక్టార్ 71, మొహాలీలో నివసిస్తున్నాడు. ఘటనపై అతని కుటుంబీకులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రసిద్ధ షూటర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం తెలియట్లేదు. ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. మాటౌర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హర్విందర్ విర్క్ నేతృత్వంలో SSO పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనపై స్పందించేందుకు ఇంకా ఏ అధికారి అందుబాటులోకి రాలేదు. మొహాలీలోని సివిల్ హాస్పిటల్‌లో మధ్యాహ్నం నమన్వీర్ బ్రార్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ట్రాప్ షూటర్ బ్రార్ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్‌లో తక్కువ క్వాలిఫైయింగ్ స్కోర్‌తో నాల్గవ స్థానంలో నిలిచాడు. 2015లో, అతను దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. నామన్‌వీర్ 2013లో ఫిన్లాండ్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. గ్రాడ్యుయేషన్ రెండవ సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించాడు నమన్వీర్. అతి తక్కువ సమయంలో విజయవంతమైన షూటర్ అయ్యాడు. అతని తండ్రి అరవిందర్ సింగ్ బ్రార్, తల్లి హర్‌ప్రీత్ కౌర్ బ్రార్ అతడిని ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు.
ఇదీ చూడండి :