ETV Bharat / city

ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే.. రెండు నెలలుగా నిలిచిపోయిన చెల్లింపులు

ఉపాధిహామీ కూలీలకు వేతనాల చెల్లింపులు రెండు నెలలుగా నిలిచిపోవటంతో ఆ ప్రభావం ప్రస్తుత పనులపై కనిపిస్తోంది. ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే రావాల్సి ఉండగా.. క్రమంగా కూలీల హాజరు తగ్గుతోంది. గత ఏడాది ఇదే నెలలో హాజరైన కూలీలతో పోలిస్తే 35-40% తక్కువగా వస్తున్నారు.

ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే
ఉపాధి బకాయిలు 400 కోట్లకు పైనే
author img

By

Published : Jul 16, 2022, 4:45 AM IST

ఉపాధిహామీ కూలీలకు వేతనాల చెల్లింపులు ఆలస్యం అవుతుండటంతో.. ఆ ప్రభావం ప్రస్తుత పనులపై కనిపిస్తోంది. కూలీల హాజరు క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది ఇదే నెలలో హాజరైన కూలీలతో పోలిస్తే 35-40% తక్కువగా వస్తున్నారు. ఉపాధి కూలీలకు రెండునెలలుగా రూ.400 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది పనిదినాల కేటాయింపుల్లో కేంద్రం భారీగా కోత విధించింది. తొలి విడతగా 25 కోట్ల పనిదినాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, 14 కోట్లే కేటాయించింది. ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లోనే (ఏప్రిల్‌-జూన్‌) వీటిని వినియోగించారు. ఇప్పటివరకు 15.68 కోట్లకు పైగా పనిదినాలు కల్పించారు. నరేగా చట్టప్రకారం ఏడాదిలో ఒక్కో కుటుంబానికి వంద పనిదినాలు కేటాయించాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా మండలాల్లో ఉపాధి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా వేతనాల చెల్లింపుల్లో జాప్యంతోనే కూలీలు ఈ పనులకు రావట్లేదు.

శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో 8, 9 వారాల వేతనాలు చెల్లించాలి. అనంతపురం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 వారాల వేతనాలు ఇవ్వాలి. గతంలో 3 నుంచి 4 వారాలకోసారి చెల్లింపులు జరిగేవి. కేంద్రం నుంచి నిధుల కేటాయింపుల్లో జాప్యమైన విషయాన్ని అధికారులూ అంగీకరిస్తున్నారు. అదనపు పనిదినాల కోసం కేంద్రంతో చేస్తున్న సంప్రదింపులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సాధారణంగా రాష్ట్ర అధికారులను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దిల్లీకి పిలిపించి అదనపు అవసరాలపై సమీక్షించి కేటాయిస్తుంది. ఇప్పటివరకూ దిల్లీ నుంచి అలాంటి పిలుపు రాలేదని తెలుస్తోంది.

మెటీరియల్‌ పనుల మంజూరులో తగ్గిన జోరు
ఉపాధి పని దినాలను కేంద్రం భారీగా తగ్గించడంతో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేసే పనుల మంజూరులో అధికారులు జోరు తగ్గించారు. ఏటా గతంలో 22 నుంచి 24 కోట్లకుపైగా రాష్ట్రంలో పనిదినాలు వినియోగించుకునేవారు. వీటికి వేతన బడ్జెట్‌లో 2/3 వంతు మెటీరియల్‌ కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తోంది. గత ఏడాది రూ.3,600 కోట్ల వరకు ఇలాగే సమకూరాయి. పనిదినాలు 14 కోట్లకు పరిమితం కావడంతో మెటీరియల్‌ నిధులు ఈ ఏడాది రూ.1,800 కోట్లకు మించి వచ్చే అవకాశం లేదు. గత మూడేళ్లలో రూ.1,200 కోట్లకుపైగా విలువైన పనులకు అధికారులు అనుమతులిచ్చి ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా పనులు గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో మెటీరియల్‌ కింద కొత్త పనులు కేటాయించాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనలను కొన్ని జిల్లాల్లో పక్కన పెడుతున్నారు. ప్రాధాన్యక్రమంలో కొత్తవి కేటాయిస్తూ.. నిర్మాణంలో ఉన్నవి పూర్తిచేయించే యోచనతో ఉన్నామని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.