గ్రానైట్ అక్రమాలపై దృష్టి పెట్టి.. నిందితులపై కేసులు పెడతామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లకు జీఎస్టీ విధింపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ నూతన భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. పన్ను వసూళ్లు బాగా చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా జనవరి నాటికి రూ.36 వేల కోట్లు వసూలు చేశామని అన్నారు. మార్చి 31 నాటికి రూ.45 వేల కోట్లు వసూలు అవుతాయని అంచనా వేస్తున్నట్లు నారాయణస్వామి వెల్లడించారు.
ఇదీ చదవండి: