Lokesh Fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మోసపురెడ్డిగా మారారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించిన లోకేశ్.. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 23వ వార్డుకు చెందిన 40 మంది వైకాపా కార్యకర్తలు.. లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ.. ఇంటికో కొవ్వత్తి, అగ్గిపెట్టె, విసనకర్ర పంచారు. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు.
ముందు రూ.700కోట్లు అని.. తర్వాత రూ. 1500కోట్ల భారం వేశారని దుయ్యబట్టారు. చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వం.. మురుగు కాల్వలు శుభ్రం చేయడాన్ని మరిచిందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. సొంత బాబాయి హత్య విషయంలో సీఎం జగన్ ఎన్నో ఆబద్దాలు చెప్పారని విమర్శించారు.
ఇదీ చదవండి: "బస్సు ఎక్కుదామన్నా.. బాదుడే బాదుడు".. తెదేపా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు..!