నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తూ, పర్యావరణాన్ని దెబ్బతీయటం ద్వారా వచ్చే అభివృద్ధి అవసరం లేదంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాల వల్ల జరిగే మేలు కంటే అనర్థాలే ఎక్కువన్నారు. ప్రపంచమంతా పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తుంటే నల్లమలలో యురేనియం తవ్వకాలు ఎందుకని లోకేశ్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: జగన్ హామీకి నిలకడ లేదు..ట్విట్టర్లో లోకేశ్