అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద అసలు ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. రాజధానిని ఇంకెక్కడికైనా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అని నిలదీశారు. అమరావతిలో భవనం కట్టుకున్న జగన్... రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని... ఇప్పుడు అమరావతి ఎడారిని తలపిస్తోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై అధ్యక్షుడి వైఖరి ఏమిటో తెలియక వైకాపా నాయకులు రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి :