ETV Bharat / city

ముఖ్యమంత్రికి నారా లోకేశ్​ లేఖ.. కారణం ఇదీ..!

రాష్ట్రంలో అన్నదాతల ఇబ్బందులు తొలగించాలని ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. లాక్​డౌన్​ వల్ల రైతులు నష్టపోతున్నారని.. గిట్టుబాటు ధరలు లేక రోడ్లపైనే పంటను పారబోస్తున్నారని అన్నారు. అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 27, 2020, 5:39 PM IST

nara lokesh letter to cm jagan about farmers problems in ap state
సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ

రాష్ట్రంలో రైతుల పరిస్థితి గురించి వివరిస్తూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్​కు లేఖ రాశారు. లాక్​డౌన్​ వల్ల అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని.. పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. ప‌ట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుందని మండిపడ్డారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మార్కెటింగ్ సదుపాయం లేక రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం సర్కారు దృష్టికి రాలేదా అని నిలదీశారు. గిట్టుబాటు ధరలు లేక, అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వం విఫలం

'రైతులకు భరోసా ఇవ్వడంలో వైకాపా ప్ర‌భుత్వం విఫల‌మైంది. రబీ సీజన్​లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా.. అందులో అరటిని 7 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రకటనలు, కొనుగోలుకు ఎంత తేడా ఉందో అర‌టి ధ‌ర చూస్తే అర్థమ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రం రూ.30 వేల కోట్లు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోంది. మీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? టన్ను అరటి లాక్​డౌన్​కు ముందు రూ.15,000 వరకు ఉండగా.. నేడు రూ.1000 నుంచి రూ.1500కు కొనుగోలు చేస్తున్నారు. కర్భూజ టన్ను రూ.3 వేలకు కొంటున్నారు. టమాట కేజీ రూ.2కు కొంటున్నారు. కొబ్బరికాయ వంద కౌంట్ రూ.700కు కొంటున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన ఉండడం లేదు' అని లేఖలో లోకేశ్ ప్రస్తావించారు.

కొనేవారెక్కడ?

'లాక్​డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదు. ఇప్పుడు రబీ సీజన్​లో​ పంట కోతకు వచ్చింది. మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉంది. వీటిని కొనే నాథుడే లేడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న మీ హామీ మాటలకే పరిమితం అయింది. ఈ - క్రాప్ బుకింగ్​తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలి' అని లోకేశ్​ పేర్కొన్నారు.

సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరిందని లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్సారం చేయకుండా ఆదుకోవాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రి జగన్​పై ఉందన్నారు.

ఇవీ చదవండి..

'కర్నూలులో పర్యటించే ధైర్యం ఉందా సీఎం గారూ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.