పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభిస్తే, రాష్ట్రం పరిస్థితి ఏంటని నిలదీయకుండా.. ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలు పాల్గొనడమేంటని తెలుగుదేశం ధ్వజమెత్తింది. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామన్న సీఎం జగన్.. వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహించారు. కేసుల గురించి కాకుండా ఇప్పటికైనా ప్రత్యేకహోదా గట్టిగా అడగాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైకాపా నేతల ఫొటోలను లోకేశ్ ట్వీట్ చేశారు.
-
మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?(1/2) pic.twitter.com/0d4YQRypzd
— Lokesh Nara (@naralokesh) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?(1/2) pic.twitter.com/0d4YQRypzd
— Lokesh Nara (@naralokesh) April 1, 2021మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?(1/2) pic.twitter.com/0d4YQRypzd
— Lokesh Nara (@naralokesh) April 1, 2021
ఏపీకి హోదా సాధ్యం కాదన్న భాజపా.. పుదుచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. హోదా తెస్తామన్న జగన్.. ఇప్పుడు ప్రజల తరుఫున పోరాటం చేయకుండా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మిగుల్చుతున్నారు: లోకేశ్
సర్పంచుల హక్కులు, అధికారాలకు కోత పెడుతూ జీవో నెంబర్2 తీసుకొచ్చి... వారిని ఉత్సవ విగ్రహాలుగా మిగుల్చుతున్నారని మరో ట్వీట్లో లోకేశ్ ధ్వజమెత్తారు.
-
గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి @ysjagan నియంతస్వామ్యంలో వెళ్ళిపోతుంది. జీవో 2తో సర్పంచుల హక్కులు, అధికారాలకు కోత పెడుతున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు.(1/2)
— Lokesh Nara (@naralokesh) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి @ysjagan నియంతస్వామ్యంలో వెళ్ళిపోతుంది. జీవో 2తో సర్పంచుల హక్కులు, అధికారాలకు కోత పెడుతున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు.(1/2)
— Lokesh Nara (@naralokesh) April 1, 2021గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి @ysjagan నియంతస్వామ్యంలో వెళ్ళిపోతుంది. జీవో 2తో సర్పంచుల హక్కులు, అధికారాలకు కోత పెడుతున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయంతో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోనున్నారు.(1/2)
— Lokesh Nara (@naralokesh) April 1, 2021
"గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్ నియంతస్వామ్యంలోకి వెళ్ళిపోతోంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం కల్పించిన హక్కులపై జీవో 2తో వేటు వెయ్యడం రాజ్యాంగ ఉల్లంఘనే. సర్పంచుల హక్కులను కాలరాసే జీవోను వెంటనే రద్దు చేయాలి." - నారా లోకేశ్
ఇదీ చదవండి: