ఇప్పటికైనా నోరుతెరచి మాట్లాడండి వైఎస్ జగన్ గారూ. కళ్లెదురుగా ఇన్ని నిజాలు కనిపిస్తుంటే మౌనంగా ఉండకుండా నోరుతెరచి మాట్లాడండి. 20 లక్షల మంది భవితవ్యంతో ఆటలాడుకుంది ప్రభుత్వం.. కేవలం మా వైకాపా కార్యకర్తలు, అభిమానుల కళ్లలో ఆనందం చూడడం కోసమే పేపర్లు లీక్ చేశాము అని చెప్పండి జగన్ గారూ.
5 లక్షలకి పేపర్లు అమ్ముకున్నారని మీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు, గ్రామ వాలంటీర్లు 90%, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగానికి అర్హత పొందినవాళ్లలో కూడా చాలావరకు మీ వైకాపా అభ్యర్థులే ఉన్నారని మీ ఎంపీ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. ఇప్పటికైనా మాట్లాడండి జగన్ గారూ.
రాష్ట్ర యువతకి మీరు చేసిన అన్యాయం క్షమించరానిది. మీ పాలన రాష్ట్రానికి శాపం. గడచిన 100 రోజుల్లోనే మీ పనితనం ప్రజలకి అర్థం అయిపోయింది. అందుకే మీ ఎమ్మెల్యేలు కూడా జనాల్లోకి వెళ్లాలంటే సిగ్గు పడుతున్నారు. ఇప్పటికైనా మాట్లాడండి జగన్ గారూ!!
గ్రామ సచివాలయ పరీక్షా ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం. పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు.
-నారా లోకేశ్
ఇదీ చదవండి: సీఎం రాజీనామా చేస్తారా? మంత్రులు చేస్తారా?: చంద్రబాబు