ETV Bharat / city

Fake Baba: సాఫ్ట్​వేర్​ నుంచి సాధువుగా.. భక్తి ముసుగులో దొంగ బాబా మహిమలు - దొంగ బాబా మహిమలు

అతడో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అప్పుల వాళ్లు తరచూ వేధించడంతో ఏం చేయాలో తోచలేదు. జనాల భక్తినే సొమ్ము చేసుకోవాలని... వాళ్ల అమయాకత్వాన్నే పెట్టుబడిగా వ్యాపారం మొదలుపెట్టాడు. కట్టూబొట్టూ మార్చి బాబాగా అవతారమెత్తాడు. భక్తి ముసుగులో అందినకాడికి హుండీల్లో వేసుకుని దాచుకున్నాడు. మహిళలతో రాసలీలలు సాగించాడు. చివరికి ఓ భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదుతోనే గుడారం గుట్టు మొత్తం రట్టైంది.

భక్తి ముసుగులో దొంగ బాబా మహిమలు
భక్తి ముసుగులో దొంగ బాబా మహిమలు
author img

By

Published : Aug 3, 2021, 8:20 PM IST

భక్తి ముసుగులో దొంగ బాబా మహిమలు

దేశంలో రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తున్నాడు. ఎంత మంది బండారాలు బయపడ్డా.. ప్రజలు ఇంకొ దొంగ బాబాను నమ్మి.. వాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. అలాంటి మరో కొత్త దొంగ బాబాను తెలంగాణలోని నల్గొండ పోలీసులు అరెస్ట్​ చేశారు. సాఫ్ట్​వేర్​కు అంతగా రెవెన్యూ లేదని భావించి.. జనాలు భక్తిని సొమ్ము చేసుకుంటే మార్కెట్​ పెంచుకోవచ్చని... బాబాగా అవతారమెత్తిన బీటెక్​ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ బాబాకు శిష్యులుగా వ్యవహిరిస్తున్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడి బాధితుల్లో ఒకరైన ఓ మహిళాభక్తురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేయగా.. ఈ సాఫ్ట్​వేర్​ బాబా మహత్యాలు మొత్తం బయటపడ్డాయి.

సాఫ్ట్​వేర్​ కంపెనీ దివాలా..

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన విశ్వ చైతన్య.. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం అనంతరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నెలకొల్పాడు. ఆర్థిక ఇబ్బందులతో కంపెనీని మూసివేశాడు. నాలుగేళ్ల క్రితం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అజ్మాపురంలో శ్రీసాయి సర్వస్వం మాన్సి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. తన పేరు విశ్యచైతన్యబాబాగా చెప్పుకున్నాడు. ఏడాది క్రితం పీఏపల్లి మండలంలోని సాగర్‌ వెనుక జలాల సమీపంలో 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం నిర్మించాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి.. శారీరక, మానసిక రోగాలను ఆధ్యాత్మిక చింతన ద్వారా నయం చేస్తానని ప్రకటించాడు. ఇతడి నిజస్వరూపం గురించి తెలియని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆన్‌లైన్‌, చరవాణి ద్వారా సంప్రదించారు. మొదట్లో తక్కువ ఫీజు తీసుకొని, మాయమాటలు చెప్పి నమ్మించాడు. తనను పూర్తిగా నమ్మిన భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. వారితో అసభ్యంగా చాటింగ్‌ చేయడం, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారి నుంచి డబ్బులు, ఆస్తులు విరాళాలుగా తీసుకోవడం చేసేవాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు..

విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి గుడి నిర్మిస్తానంటూ రూ.కోటి విరాళం తీసుకున్నాడు. ఇప్పటికీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి ఇటీవల నల్గొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆ సాఫ్ట్​వేర్​ బాబా బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. విశ్వచైతన్య ట్రస్టుపై నల్గొండ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. భక్తి పేరుతో మహిళలను లోబరుచుకున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.26 లక్షల నగదు.. 500 గ్రాముల బంగారం, రూ.1.55 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, 7 ల్యాప్‌ట్యాప్‌లు, 4 సెల్ ఫోన్లు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహిళలతో న్యూడ్​ వీడియో కాల్స్​...

"పలువురు మహిళలతో విశ్వచైతన్యకు చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తన ట్రాప్​లో పడ్డ వాళ్లతో... గ్రాండ్​ మాస్టర్​ పేరుతో వాట్సప్​లో అసభ్యకరంగా చాటింగ్​ చేసేవాడు. బాధితులను లైంగికంగా వాడుకున్నాడు. మహిళలతో న్యూడ్​ వీడియో కాల్స్​ కూడా చేశాడు. వాటికి సంబంధించిన వీడియో రికార్డింగ్​లు, స్కీన్​షాట్లు కూడా దొరికాయి. ఇంకొందరు మహిళలు ఇతనిపై కేసులు కూడా పెట్టారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. విశ్వ చైతన్య వయస్సు సుమారు 55 ఏళ్లు, డిగ్రీ పూర్తి చేసి 2002లో హైదరాబాద్ శివమ్ రోడ్డులో న్యూ నల్లకుంటా ప్రీమియర్ కంప్యూటర్ సెంటర్ పెట్టి ప్రజల నుంచి సుమారు కోటి రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని నాంపల్లి పోలీసు స్టేషన్​లో కేసు నమోదు అయింది. విశ్వచైతన్యకు 40 దేశాల్లో భక్తులున్నారు. 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం నిర్మించేందుకు చాలా మంది దగ్గర విరాళాలు సేకరించాడు. ఈ సాఫ్ట్​వేర్​ బాబా బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వీఐపీలతో పాటు ఇద్దరు టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం."- రంగనాథ్​, ఎస్పీ

ఇవీ చూడండి:

స్టాక్​ మార్కెట్లలో రికార్డుల మోత- ఆల్​ టైం హైకు సూచీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.