ముఖ్యమంత్రి జగన్పై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రపంచమంతా కరోనా నియంత్రణకు కృషి చేస్తుంటే... రాష్ట్రంలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నవేళ.. సీఎం ఎన్నికల కమిషన్ను విమర్శించేందుకే మీడియా సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం జగన్కు ప్రజల ప్రాణాల కంటే... ఎన్నికల ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకోసం రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. 243(కె)కు వక్రభాష్యం చెప్పే అతి తెలివితేటలను వైకాపా నేతలు మానుకోవాలని హితవు పలికారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే కరోనా నివారణకు రాష్ట్రంలో చేపట్టిన చర్యలు శూన్యమని విమర్శించారు.
ఇదీ చదవండి: