నగరాలను తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని కోరుతూ... మంత్రి శంకరనారాయణకు ఆ సంఘం నేతలు వినతిపత్రం అందించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యములో నగరాల సంఘం నాయకులు మంత్రి శంకరనారాయణతో భేటీ అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాలోని నగరాలను బీసీల్లో చేర్చి సామాజిక న్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరాల కులాన్ని... మిగిలిన తొమ్మిది జిల్లాలకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... సీఎంతో ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ ప్రతినిధుల భేటీ