కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీ రోడ్డులో మతీన్ స్నేహితుల బృందం నివాసముంటుంది. ఈ సభ్యుల్లోని అనూప్‌సింగ్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్నేహితులందరూ అతనికి ధైర్యం నూరిపోశారు. ఏమీ కాదు నీకు అంటూ భరోసానిచ్చారు. కానీ అనూప్‌సింగ్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
స్నేహితడు మృతి చెందినా.. వారంతా అతనిని విడిచిపోలేదు. తమ మతం కాదని ఆలోచించలేదు. ఆస్పత్రి నుంచి మొదలుకుని.. సిక్కు పద్ధతి అనుసరించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహానికి కులమతాలే కాదు.. ఏ వైరస్ కూడా అడ్డురాదని నిరూపించి ఆదర్శంగా నిలిచారు ఈ స్నేహ బృందం.
ఇదీ చూడండి: