ETV Bharat / city

నేటి నుంచే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ప్రక్రియ - నల్గొండ తాజా వార్తలు

Munugodu election Nominations begin on today: అందరి దృష్టి ఇప్పుడు తెలంగాణలోని మునుగోడు పైనే ఉంది. ఎందుకంటే గత నెల రోజులుగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పర్యటనలతో అక్కడి రాజకీయం వేడెక్కింది. అయితే ఈ పోరుకు కీలకమైన ముందడుగు పడింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ప్రక్రియ
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ప్రక్రియ
author img

By

Published : Oct 7, 2022, 9:35 AM IST

Munugodu election Nominations begin on today: తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం శుక్రవారం(7వతేదీ) నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం గురువారం సమావేశమైంది. రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చండూరు తహసీల్దారు కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేలా అక్కడ ‘హెల్ప్‌ డెస్క్‌’ ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. 2018లో మునుగోడు అసెంబ్లీ స్థానానికి తెరాస, కాంగ్రెస్‌, భాజపా వంటి ప్రధాన పార్టీలు, స్వతంత్రులు సహా 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది పోటీలో మిగిలారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.