గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీలోని 16వ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి నామినేషన్ వేసిన తెదేపా అభ్యర్థి కసుకుర్తి సంగీతరావు మరణించారు. అతడి స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్ల స్వీకరణకు రేపల్లె పురపాలక అధికారులు ఏర్పాట్లు చేశారు. తెదేపాకు చెందిన కసుకుర్తి క్రిస్టినమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలోని 25వ వార్డులో పుర ఎన్నికలకు నలుగురు భాజాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో ఇదే వార్డులో నామినేషన్ వేసిన మోదాల నాగరాజు అనే అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందారు. అతడి స్థానంలో కొత్తగా నామినేషన్లు వేశారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో.. గతంలో నాల్గోవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలుగుదేశం అభ్యర్థి చనిపోవడంతో ఆ వార్డుకు మళ్లీ నామినేషన్ దాఖలు చేశారు. రామదాసు గౌడ్ అనే వ్యక్తి అభ్యర్థిగా పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు.
ఆదోని పురపాలక సంఘం పరిధిలో వైకాపా అభ్యర్థులు 40, 41 వార్డులకు నామ పత్రాలు దాఖలు చేశారు. 40వ వార్డులో నజీర్ అహ్మద్ మరణించడంతో అతని కోడలు సలీమా భాను, 41వ వార్డు అభ్యర్థి పార్వతి మరణంతో ఆమె మనవరాలు ఇందు, సుజాత పత్రాలు దాఖలు చేశారు. మొత్తం ఆదోనిలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధిగా తెదేపా తరఫున పట్టా శ్రావణి నామపత్రాలను దాఖలు చేశారు. ఇదే వార్డులో పట్టా మాధవి గతంలో నామినేషన్ వేశారు. ఆమె అకాల మరణంతో.. ఆమె కుమార్తెతో తెదేపా నామినేషన్ వేయించింది.
ఇదీ చదవండి: