రోగుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందడాన్ని తప్పనిసరి చేస్తున్నారు. రాష్ట్రంలో మెుత్తం 8,640 ప్రైవేట్ ఆసుపత్రులు, దంతవైద్యశాలలు, ల్యాబ్లు ఎమ్మారై సిటీ స్కాన్ కేంద్రాలున్నాయి. వీటిలో 20 నుంచి 200 మధ్య పడకలు కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులు 3,856 ఉన్నాయి. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భవనాల్లోని ఆస్పత్రులు ఫైర్ సేప్టీ చర్యలు తీసుకున్నామంటూ అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని పురపాలకశాఖ 2007లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు అగ్ని మాపకశాఖ నుంచి తప్పనిసరిగా ఎన్వోసీ పొందాల్సిందేనని ఆదేశించింది.
ఈ క్రమంలో కొవిడ్ చికిత్స అందించే ఆసుపత్రులకు వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. దాంతో కృష్ణా జిల్లాలోని 649 కొవిడ్ ఆసుపత్రుల్లో 560 వరకు ఎన్వోసీ పొందాయి. ఇతర ఆస్పత్రుల్లోనూ అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ పొందడాన్ని తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనల్లో సవరణలను తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ బోధన, ఇతర స్పెషాలిటీ అసుపత్రులూ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: