మున్సిపల్ కార్పొరేషన్‌ల మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే 12 కార్పొరేషన్లలోని వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ విజయకుమార్ దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లలో 671 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9న పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
కార్పొరేషన్ | మేయర్ల రిజర్వేషన్ల వివరాలు |
అనంతపురం | జనరల్ |
చిత్తూరు | ఎస్సీ జనరల్ |
కాకినాడ | జనరల్ మహిళ |
కర్నూలు | బీసీ మహిళ |
మచిలీపట్నం | జనరల్ మహిళ |
నెల్లూరు | ఎస్టీ జనరల్ |
ఒంగోలు | ఎస్సీ మహిళ |
రాజమహేంద్రవరం | జనరల్ |
శ్రీకాకుళం | బీసీ మహిళ |
తిరుపతి | జనరల్ మహిళ |
విజయవాడ | జనరల్ మహిళ |
విజయనగరం | బీసీ మహిళ |
కార్పొరేషన్ వార్డుల వివరాలు:
కార్పొరేషన్ | వార్డుల సంఖ్య |
---|---|
అనంతపురం | 50 |
ఏలూరు | 50 |
చిత్తూరు | 50 |
గుంటూరు | 57 |
కడప | 50 |
కర్నూలు | 52 |
మచిలీపట్నం | 50 |
ఒంగోలు | 50 |
తిరుపతి | 50 |
విజయవాడ | 64 |
విశాఖపట్నం | 98 |
విజయనగరం | 50 |