విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీ వెళ్లిన ఆయన కార్మిక సంఘాల నేతలతో కలిసి కేంద్ర కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి.. వినతి పత్రం ఇచ్చారు. 'విశాఖ ఉక్కు' ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. నవరత్న హోదా సాధించిన విశాఖ ఉక్కు ఏపీకి ఆభరణం అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్టీల్‌ప్లాంట్‌పై లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆర్థిక మంత్రికి తెలిపారు. ఉక్కు పరిశ్రమ వల్లే మహానగరంగా విశాఖ విస్తరించిందని..కరోనా వేళ స్టీల్‌ప్లాంట్‌లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి జరిగిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో తయారైన ఆక్సిజన్ లక్షలమంది ప్రాణాలు కాపాడిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: KDCC: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: మంత్రి కన్నబాబు