ఏపీలో సీఎం జగన్ పాలనపై దృష్టి సారించట్లేదు... వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని భాజపా ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. ఈ ఐదు నెలల్లో సర్కారు తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు కావట్లేదన్నారు. ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనర్థాలు వస్తున్నాయన్నారు. ఏపీలో ఒక్క పరిశ్రమ కొత్తగా రాలేదన్న సుజనాచౌదరి... ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఇకనైనా సీఎం జగన్ పాలనపై దృష్టి సారించకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
సీఎస్ బదిలీ పద్ధతి కాదు
పోలవరం విషయంలోనూ వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సుజనాచౌదరి ఆరోపించారు. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన.. ప్రాజెక్టు పూర్తైనట్లేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ వ్యవహారంలోనూ సర్కారు ఇష్టారీతిన వ్యవహరించిందని.. పద్ధతి ప్రకారం చేయాల్సిన బదిలీని.. వివాదాస్పదం చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: