ETV Bharat / city

' సరస్వతి' లీజు పునరుద్ధరణ ఉత్తర్వులను నిలిపివేయండి : ఎంపీ రఘురామ - AP Latest News

సరస్వతి కంపెనీకి మైనింగ్ లీజు పొడిగింపును సవాల్ చేస్తూ... హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ పీజపీఎల్ డైరెక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు , పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి , గనుల శాఖ డైరెక్టర్ , ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిని అప్పిల్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jun 22, 2021, 9:17 PM IST

Updated : Jun 23, 2021, 3:00 AM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఆయన భార్య భారతీ వాటా కలిగి ఉన్న సరస్వతి పవర్ సున్నపురాయి మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు . 2019 అక్టోబర్ 15 న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు . సింగిల్ జడ్జీ ఆదేశాల ఆధారంగా సరస్వతి పవర్ , ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మైనింగ్ లీజును పునరుద్ధరిస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి .. 2019 డిసెంబర్ 12 న ఇచ్చిన జీవో 109 అమలును నిలుపుదల చేయాలన్నారు . అధికారాన్ని మోస పూరితంగా ఉపయోగించి ముఖ్యమంత్రికి చెందిన కంపెనీకి అనుచిత లబ్ది చేకూర్చడం కోసం నీటి కేటాయింపు జీవోను , మైనింగ్ లీజును 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలుపుదల చేయాలని కోరారు . ఎస్ పీజపీఎల్ డైరెక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు , పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి , గనుల శాఖ డైరెక్టర్ , ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిని అప్పిల్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు . '

  • గ్రంధి ఈశ్వరరావు 1999 లో సరస్వతి కంపెనీని ఏర్పాటు చేశారు . వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఆయన తల్లి విజయమ్మ , భార్య భారతీరెడ్డి , మరో ఇద్దరు ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేశారు . తర్వాత ఒరిజినల్ ప్రమోటర్లు కంపెనీని విడిచిపెట్టారు . గుంటూరు జిల్లాలో 266 హెక్టార్లు లైమ్ స్టోన్ ప్రాస్పెక్టింగ్ లీజుకోసం 2008 మార్చి , ఏప్రిల్లో కంపెనీ దరఖాస్తు చేసింది . మైనింగ్ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాక మెమోరాండం అఫ్ అసోసియేషన్ను కంపెనీ సవరించింది
  • మైనింగ్ లీజు దరఖాస్తును అధికారులు స్వీకరించారు . 2009 మేలో మైనింగ్ లీజు ఇచ్చారు . వైఎస్ రాజు శేఖర్ రెడ్డి రెండో సారి 2009 మే 18 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం కంపెనీకి మైనింగ్ లీజు మంజూరు చేసింది . ఆ కంపెనీ ముఖ్యమంత్రి కొడుకు , కోడలు , భార్యది కావడంతో అధికారులు అనుమతులిచ్చారు
  • కంపెనీ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో 2014 లో అప్పటి ప్రభుత్వం కంపెనీ యాజమాన్యానికి షోకాజు నోటీసు ఇచ్చింది . కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని అధికారులు ... మైనింగ్ లీజు మురిగిపోయినట్లు గా ప్రకటిస్తూ 2014 అక్టోబర్ 9 న ఉత్తర్వురులు జారీచేశారు . ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ కంపెనీ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది .
  • తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించిందని పిటిషన్ లో పేర్కొన్నారు . జగన్మోహన్ రెడ్డి సంపద రూ .11 లక్షల నుంచి రూ . 45 వేల కోట్లకు పెరిగిందని కనుగొందన్నారు . ఈ వ్యవహారంలో 2012- 14 సంవత్సాల్లో సీబీఐ .. జగన్ మోహన్ రెడ్డిపై 11 అభియోగపత్రాలు దాఖలు చేసిందన్నారు . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం 6 ఛార్జిషీట్లు వేసిందని తెలిపారు . అవి న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నాయన్నారు . దర్యాప్తులో భాగంగా మైనింగ్ లీజు మంజూరులో అక్రమాలు జరిగాయని సీబీఐ కనుగొందని తెలిపారు . సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని , లీజు కాల పరిమితి ముగిసినదిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది.
  • మైనింగ్ లీజు కాలపరమితి ముగిసినట్లుగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా కౌంటర్ వేసింది . సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల్ని సైతం కోర్టు ముందు ఉంచలేదన్నారు . విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున హాజరైన అదనపు ఏజీ ... ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు . కోర్టును తప్పుదోవ పట్టించారు . ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి .. రిట్ ను అనుమతించారు . లీజు కాలపరిమితి ముగిసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు . మైనింగ్ లీజును పునరుద్ధరించాలని ఆదేశించారన్నారు .
  • సరస్వతి కంపెనీకి అనుకూలమైన ఉత్తర్వులు పొందడం కోసం న్యాయస్థానంపట్ల మోసపూరితంగా వ్యవహరించారన్నారు . సరస్వతి కంపెనీకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది మోసపూరితంగా వ్యవహరించినప్పుడు ... ఆ విషయాన్ని పౌరుడిగా న్యాయస్థానం దృష్టికి తేవాల్సి ఉందన్నారు . ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్ ఇడ్డి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి అని రఘురామ కోరారు .

ఇదీ చదవండీ... YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్

Last Updated : Jun 23, 2021, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.