ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కరోనాను కట్టడి విషయంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని.. వారి నుంచి వచ్చే సలహాలు, సూచనలను తప్పకుండా పాటించాల్సి ఉందని అన్నారు. బెయిల్ రద్దు కోరుతూ తాను వేసిన పిటిషన్ విచారణకు రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి దిల్లీ వెళ్లి పెద్దలను కలిసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
ఇవాళ విచారణకు రాగా సీఎం తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఇందువల్ల ఏదొక సాకుతో సీఎం దిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్‌ల విషయంలో.. కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే వేసేందుకు రంగం సిద్దమైందని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: