కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత దూషణలకు దిగిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎంపీ రఘురామకృష్ణమరాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రారంభమైన నిరసన కార్యక్రమం పెను తుపానుగా మారే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉన్నందున సీఎం జగన్ తక్షణమే మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియులు అంతా కూడా.. అశోక్ గజపతిరాజుపై మంత్రి చేసిన వ్యక్తిగత దూషణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక్క క్షత్రియ సమాజానికే కాదని, మొత్తం ఆంధ్రరాష్ట్రంలో మెజార్టీ ప్రజల భావనని చెప్పారు. పూసపాటి వంశీయులు చేసిన దాన ధర్మాలు, అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ఒక్కరూ, ఇప్పటీ వరకు చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొద్ది మంది పెద్దలకు కూడా ఈ విషయం తెలుసన్నారు. ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున పార్టీ సభ్యుడిగా, ఎంపీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి