ETV Bharat / city

మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు

author img

By

Published : May 17, 2021, 11:04 PM IST

Updated : May 18, 2021, 5:24 AM IST

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

23:02 May 17

మిలిటరీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు

ఎంపీ రఘురామకృష్ణరాజు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచే మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.  

నేడు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు..

ఎంపీ రఘురామకు  ఇవాళ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సైతం మిలిటరీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు రఘురామకృష్ణరాజు మిలిటరీ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

రఘురామ కేసు: అరెస్టు నుంచి ఇప్పటి వరకూ..

Last Updated : May 18, 2021, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.