రాజ్యాంగం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు అసెంబ్లీకి లేదన్న కనీస అవగాహన లేదన్నారు. న్యాయవ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఓవైపు న్యాయవ్యవస్థపై దాడిచేస్తూనే గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేస్తున్నారని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయడం హాస్యాస్పదమన్న ఆయన... సిట్ ఏర్పాటు చేస్తే కోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
'గత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించుకుంటూ పోతే ఎలా...? న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం సరికాదు. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్నా... అమరావతి భూములపై పున:సమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడం శుభపరిణామం. నా నియోజకవర్గానికే కాదు.. పులివెందులకూ వెళ్తా. కరోనా తగ్గాక పులివెందులలో 10 వేల మందితో సభ పెడతా. ఆవ భూముల కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమరావతి భూములపై సీబీఐ విచారణ కోరిన వాళ్లు... ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై ఎందుకు ఫ్లకార్డులు ప్రదర్శించలేదు' - రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇదీ చదవండి
'ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి పాత్ర... బర్త్‌రఫ్ చేసి విచారించండి'