MP GVL: పొగాకు బోర్డు సభ్యునిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావును నియమిస్తున్నట్లు....రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 14న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా...నియమించినట్లు తెలిపింది. ఏపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. తనను పొగాకు బోర్డు సభ్యుడిగా నియమించడంపై సంతోషం వ్యక్తంచేసిన జీవీఎల్...పొగాకు రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: