తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎర్రపోచమ్మ అనే మహిళకు... శ్రీశైలం(10), మహేశ్(7) ఇద్దరు కుమారులు. ఐదు సంవత్సరాల క్రితం ఆమె భర్త వదిలేయడంతో పిల్లలను చూసుకుంటూ... చిన్నచింతకుంట గ్రామంలో తన తల్లి అక్కమ్మతో కలసి ఉంటుంది. ఆమె పనుల నిమిత్తం తరుచూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటుంది.
నెలరోజుల క్రితం తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని వేరే ఊరికి వెళ్లిన పోచమ్మ... శనివారం ఉదయం ఒక్క కుమారున్నే తీసుకుని చిన్నచింతకుంట గ్రామానికి వచ్చింది. చిన్న బాబు ఎక్కడని ఆమె తల్లి నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. వెంటనే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకుని పోచమ్మను విచారించినప్పటికీ అలాగే సమాధానం చెబుతూ వచ్చింది.
ఆమెను నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తి ద్వారా రూ.15 వేలకు బాబును విక్రయించినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: