తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు.. నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి మృతి చెందారు. ఎల్లారెడ్డి మండలం మౌలాన్‌ఖేడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సూరారానికి చెందిన లింగమ్మ(40)కు సామిక (9), తీన(7) కుమార్తెలు. ఈ నెల 5న ఎల్లారెడ్డికి శుభకార్యం కోసం కూతుళ్లతో కలిసి వచ్చిన లింగమ్మ.. అనంతరం ముంభోజిపేట్లో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లింది.
లింగమ్మ అక్క తన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకోగా.. వడ్డీ ఇస్తానని వారిని మౌలాన్‌ఖేడ్ తీసుకెళ్లింది. తీరా చూస్తే.. ఈ రోజు లింగమ్మతో పాటు ఇద్దరు కూతుళ్లు విగతజీవులుగా నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో తేలారు. లింగమ్మ చివరి సారి మౌలాన్ఖేడ్కు వెళ్లినట్టు తెలియటంతో.. ఆమె సోదరిపైన బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:
బీచ్లో విగతజీవిగా 18 ఏళ్ల యువతి.. అసలేం జరిగింది?
Suicide: ఆ ఎస్సై అంతా నువ్వే అన్నాడు.. ముఖం చాటేశాడు.. అనంతపురంలో దారుణం..