ETV Bharat / city

ఎల్​ఆర్​ఎస్​ సులభం... వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్​తో దరఖాస్తులు​ - తెలంగాణ ఎల్​ఆర్​ఎస్ వెబ్​సైట్

స్థలాల క్రమబద్ధీకరణ కోసం వెబ్​సైట్ సహా మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మొబైల్ నంబర్ సహాయంతో ఆన్ లైన్ ద్వారా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్ల కోసమైతే సేల్ డీడ్​తో పాటు లేఅవుట్ నకలును జతచేయాల్సి ఉంటుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం లేఅవుట్ పత్రంతో పాటు యాజమాన్య పత్రాలు, ఇప్పటికే అమ్మిన ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్, ఈసీలు జమచేయాల్సి ఉంటుంది.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/07-September-2020/8714933_146_8714933_1599491610112.png
lrs in telangana
author img

By

Published : Sep 8, 2020, 12:34 AM IST

అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ఆన్ లైన్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్ సైట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. lrs.telangana.gov.in వెబ్ సైట్​ను సుపరిపాలనా కేంద్రం రూపొందించింది. ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్​ను కూడా రూపొందించారు. ఆండ్రాయిడ్ మొబైళ్లలో ప్లే స్టోర్ ద్వారా ఎల్ఆర్ఎస్ 2020 టైప్ చేస్తే సీజీజీ సిద్ధం చేసిన యాప్ వస్తుంది. యాప్ ద్వారా కూడా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ సహాయంతో దరఖాస్తు చేయవచ్చు.

రుసుములు చెల్లించాలి

ఎల్ఆర్ఎస్​కు సంబంధించిన పూర్తి ఉత్తర్వులు, వివరాలతో పాటు తరచూ అడిగే ప్రశ్నలు, ఇతర సమాచారాన్ని వెబ్ సైట్​లో, యాప్​లో పొందుపరిచారు. ప్లాటు క్రమబద్ధీకరణ కోసం సేల్ డీడ్, లేఅవుట్ కాపీ అవసరం. లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసమైతే లేఅవుట్​తో పాటు యాజమాన్య పత్రాలు, ఇప్పటికే అమ్మిన ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్లు, ఈసీ కాపీలు అవసరం. ప్లాట్ల దరఖాస్తుదారులు వెయ్యి రూపాయలు, లేఅవుట్ల దరఖాస్తుదారులు పదివేల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

హెల్ప్​లైన్లు

హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్లాట్ల కోసం 1800-4258838, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్లాట్ల కోసం 040-21111111 నంబర్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు. support-lrs@telangana.gov.in మెయిల్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.