పదవిలో ఉండటమంటే అవినీతి చేయడానికో, ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికో అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, వ్యవస్థలను సంస్కరించడమేనని తెలిపారు. అటువంటి పాలన ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని తేల్చిచెప్పారు. ఇది పదేపదే నిరూపితం అవుతున్న సత్యమంటూ.. సులభతర వాణిజ్యంలో ఏపికి మొదటి ర్యాంకుపై తెదేపా రూపొందించిన వీడియోను విడుదల చేశారు.
ఇదీ చదవండి: