MLC Kavitha on BJP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో ఆడపడుచులకు ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుందని స్పష్టంచేశారు. కేంద్రంలో... 22లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన భాజపా.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని కవిత ప్రశ్నించారు. ఉద్యోగ ప్రకటన కోసం ఎంపీలు, ప్రధానిని నిలదీయాలన్నారు.
కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆమె.. వారికి గట్టిగా సమాధానం చెప్పాలని సూచించారు. మరికొందరు తెలంగాణ సమాజాన్ని మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, భాజపా పాలిత రాష్ట్రాల్లో పథకాల అమలును గమనించి ఆలోచన చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహిళలకు విజ్ఞప్తి చేశారు.
'అధికారంలో ఉన్నా లేకున్నా తెరాస ప్రజలతోనే ఉంటుంది. కొందరు ప్రజలను విడగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని మతం పేరుతో రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో 22లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్ని భాజపా చెప్పింది. వాటిని వారు ఎందుకు భర్తీ చేయడంలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంపీలు, ప్రధానిని నిలదీయండి.'- కవిత, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: