అమరావతిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారని.. తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. తుళ్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 2లక్షల మంది విద్యార్థులు చేరారని గుర్తుచేశారు.
మాతృభాషతో పాటు ఆంగ్లంలోనూ బోధన జరిగితే పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో ఎవరికీ అన్యాయం జరగదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించలేదు. సుమారు వందమందికిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భౌతికదూరం మరిచిన అధికారులు... విద్యార్థులకు, పార్టీ నేతలకు పక్కపక్కనే కుర్చీలు వేశారు.
ఇదీ చదవండి: