పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే చారిత్రాత్మక కార్యక్రమం చేపడుతుంటే హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేశారని... ఫలితంగానే ఇళ్ల పంపిణీని ఆపివేయాల్సి వచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో శిఖండి పాత్ర పోషిస్తున్న వారు ఎప్పటికైనా ఓడిపోకతప్పదన్నారు.
ఇదీ చదవండి:
గ్యాస్ లీకేజీ ఘటనలపై ఎన్జీటీ కమిటీలు ...మూడు నెలల్లో నివేదిక