రాజకీయాల్లో ప్రత్యర్థుల్లా ఉండాలే తప్ప విరోధులుగా ఉండకూడదని సీఎం జగన్‌కి తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. సీఎం తీరు చూస్తుంటే ప్రతికారేచ్ఛతో రగిలిపోతన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. పాలించే వారికి ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదని అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: కుంభకోణాలపై విజయసాయిరెడ్డి మాట్లాడటమా..?: అయ్యన్నపాత్రుడు